తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో నిప్పులు కురిపిస్తోన్న సూరీడు.. ఇప్పుడే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.. - రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

highest temperatures registered in telangana districts
highest temperatures registered in telangana districts

By

Published : Mar 17, 2022, 6:33 PM IST

17:01 March 17

అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల వివరాలు..

Summer Effect in Telanagana: రాష్ట్రంలో భానుడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. అప్పుడే.. నడి వేసవికాలంలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాల మాడలు పగలగొడుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు(మార్చి 17న) చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్​ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గరిష్ణంగా పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్​లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆదిలాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్​, నిర్మల్​, ములుగు, జగిత్యాల, ఖమ్మం, కరీంనగర్​, నిజామాబాద్​, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతున్న క్రమంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Summer Effect in AP: అటు ఏపీలోనూ.. ఎండాకాలం ప్రభావం మొదలైంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరాయి. రాత్రి 8 గంటలైనా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ సుర్రుమంటోంది. ఎండ వేడిమి, ఉక్కపోత నేపథ్యంలో ఏసీల వాడకమూ అధికమైంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details