"సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చవద్దు" - highcourt ordered telangana government that do not demolish the secretariat and irummanjil buildings
న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హామీ ఇవ్వాలని కోరింది.
నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేసేందుకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ కోరారు. విచారణ పెండింగ్లో ఉన్నంతవరకు భవనాలు కూల్చవద్దని అభిప్రాయపడిన ఉన్నత న్యాయస్థానం ఆ మేరకు హామీ ఇవ్వాలని సూచించింది. ఈరోజు మధ్యాహ్నమే వాదనలు వినిపిస్తామని అదనపు ఏజీ పేర్కొనగా... హైకోర్టు అంగీకరించింది.
- ఇదీ చూడండి : ఆర్టీఏ యాప్లతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకులు