దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శంకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం వాదనలు జరిగాయి. రూ.2.5 కోట్ల భూమిని రూ.25 లక్షలకు ఎలా కేటాయిస్తారని హైకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా? హైకోర్టు ఏజీని నిలదీసింది.
'తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా?'
'తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా?'
14:16 August 27
'తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా?'
ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదు. ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదు. మంత్రివర్గ నిర్ణయాలకు సహేతుకత ఉండాలి. - హైకోర్టు
విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరగా.. విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి:'అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందే ఉంటుంది'
Last Updated : Aug 27, 2020, 3:21 PM IST