తెలంగాణ

telangana

ETV Bharat / city

AIDED Schools: ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - aided schools merging in ap

ఏపీలో ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విలీనం విషయంలో విద్యాసంస్థలపై ఒత్తిడి చేయొద్దని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

AP aided schools
ఏపీ ఎయిడెడ్ పాఠశాలలు

By

Published : Oct 4, 2021, 5:55 PM IST

ఏపీలో ఎయిడెడ్ పాఠశాలల విలీన ప్రక్రియపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 22లోపు అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 28వరకు విద్యా సంస్థలపై ఒత్తిడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అదేవిధంగా విల్లింగ్ ఇవ్వలేదని విద్యా సంస్థలకు గ్రాంట్ ఆపవద్దని హైకోర్టు పేర్కొంది. అనంతరం కేసు విచారణను ధర్మాసనం ఈ నెల 28కి వాయిదా వేసింది.

రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను (Aided Educational Institutions) ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను (G.O) సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాయి. విచారణలో భాగంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటిషనర్‌ (Petitioner‌) తరఫు న్యాయవాది ఎన్​.సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పిటిషనర్‌ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పిటిషనర్‌ ప్రొసీడింగ్స్‌ (Petitioner‌ Proceedings‌)ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు.

ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోకి తీసుకునేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు (Acceptance Documents) తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

ఇదీ చదవండి:Jaggareddy comments on pm modi: 'భాజపాది రైతుల పొట్టకొట్టే ప్రయత్నం'

ABOUT THE AUTHOR

...view details