తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్ - MP Vijaya sai reedy news

ఏపీలో తెదేపా, వైకాపా నేతల మధ్య ప్రమాణాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగింది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్
విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్

By

Published : Dec 27, 2020, 2:46 PM IST

దేవుడిపై ప్రమాణాలు చేయాలని తెదేపా, వైకాపా ప్రమాణ సవాళ్లతో... అంధ్రప్రదేశ్​లోని విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆదివారం ఉద్రిక్తత కొనసాగింది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో శనివారం నుంచి ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇవాళ గాజువాక మండలం మింది నుంచి భారీ వాహన శ్రేణితో వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖ బీచ్‌ రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం 11 గంటల సమయంలో విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి ర్యాలీగా వచ్చారు.

మా పార్టీ పెద్దలపై ఆరోపణలు చేసినందుకే మేం స్పందించాం. స్థానికేతరుడైన వెలగపూడి విశాఖలో భూఆక్రమణలకు పాల్పడ్డారు. ఆధారాలుతో సహా బాబా గుడికి వచ్చాం. విజయసాయిరెడ్డి వస్తేనే ప్రమాణం చేస్తామని ఆయన అనడం సరికాదు. భూ అక్రమాలపై త్వరలో సిట్ నివేదిక వస్తుంది. దాని ప్రకారం బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

- గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే

గంట పాటు కార్యకర్తలతో కలసి అమర్నాథ్ ఆలయం వద్దే ఉన్నారు. అప్పటికీ వెలగపూడి రాకపోవటంతో సాయిబాబా గుడి నుంచి ఎమ్మెల్యే అమర్నాథ్‌, కార్యకర్తలు వెనుదిగిరారు. వైకాపా శ్రేణులు వెళ్లిపోవటంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ముందు జాగ్రత్తగా ఆలయం వద్ద పోలీసులు మొహరించారు. మరోవైపు తాను సవాలు విసిరింది ఎంపీ విజయసాయిరెడ్డికి అని... ఆయన వస్తేనే తానూ ప్రమాణం చేస్తానని వెలగపూడి స్పష్టం చేశారు. ఎంపీ సవాల్‌ స్వీకరించకుండా అందరితో మాట్లాడిస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

ABOUT THE AUTHOR

...view details