తెలంగాణ

telangana

ETV Bharat / city

చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత - high alert at chiru residency

అమరావతి ఐకాస నేతలు చిరంజీవి ఇంటిని ముట్టడిస్తున్నానే వార్తల నేపథ్యంలో మెగాస్టార్​ ఇంటి వద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఐకాస నేతల తీరును వ్యతిరేకిస్తూ చిరు అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

high tension at megastar chiranjivi house
చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత

By

Published : Feb 29, 2020, 2:51 PM IST

అమరావతి ఐకాస నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్​లోని చిరంజీవి నివాసం వద్ద ఆయన అభిమానులు ఆందోళన నిర్వహించారు. ఐకాస నేతలు చిరంజీవిని కలవడానికి జూబ్లీహిల్స్​కు వస్తున్నారనే సమాచారం మేరకు వారిని అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు మెగాస్టార్​ ఇంటికి చేరుకున్నారు.

చిరంజీవికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాసనసభ్యులను దుయ్యబట్టారు. అభిమానుల రాకతో అక్కడే ఉన్న పోలీసులు.. ఎవరిని చిరంజీవి నివాసానికి చేరుకోకుండా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిరంజీవి ఇంటికి వెళ్లే దారిని బారికేడ్లతో మూసివేసి బందోబస్తు నిర్వహించారు.

అయితే తాము చిరంజీవి ఇంటిని ముట్టడించడంలేదని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు. ఈ వార్తను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.

చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇవీ చూడండి:కరెంటు ఛార్జీలపై నేడు నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details