తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అందుకే! - high power consumption in telangana

రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సోమవారం నాడు 12 వేల 976 మెగావాట్ల విద్యుత్​ వినియోగించగా... ఇవాళ 13 వేల 200కు చేరింది. డిమాండ్​ ఎంత పెరిగినా... సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

high power consumption in telangana state
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

By

Published : Feb 25, 2020, 10:46 PM IST

రాష్ట్రంలో విద్యుత్ వాడకం పెరిగింది. రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం నాడు 12 వేల 976 మెగావాట్స్​ వినియోగం నమోదు కాగా... దాన్ని మించి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 13 వేల 200ల మెగావాట్ల వాడకంతో రికార్డుకెక్కింది. 253 మిలియన్​ యూనిట్స్​ నమోదవడం ఇదే మొదటిసారి అని విద్యుత్​శాఖ అధికారులు తెలిపారు.

వ్యవసాయ వినియోగం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలోనే అదనంగా పెరిగిపోయిందన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. దీనికితోడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మోటార్లన్నీ పనిచేస్తుండటం వల్ల అదనంగా వెయ్యి మెగావాట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 21న 1, 341మెగావాట్స్​ వినియోగించగా... కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 1000 మెగావాట్స్, దేవాదుల ప్రాజెక్టుకు 147, కల్వకుర్తి, నెట్టెంపాడుకు కలిపి 194 మెగావాట్స్ కాల్చినట్లు అధికారులు తెలిపారు. 18వ తారీఖున వినియోగించిన 1,724 మెగావాట్స్​లో... కాళేశ్వరం 1, 347 మెగావాట్స్, దేవాదుల ప్రాజెక్టుకు 143, కల్వకుర్తి, నెట్టెంపాడుకు కలిపి 243 మెగావాట్స్​ వాడినట్లు వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదే విధంగా నీళ్లు ఉంటే... విద్యుత్ వినియోగం 13 వేల 200ల మెగావాట్లకు మించి వినియోగం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండు ఎంత పెరిగినా... సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో విద్యుత్‌ అందుబాటులో ఉందని... రాష్ట్రంలో డిమాండు పెరిగినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

ABOUT THE AUTHOR

...view details