అన్‌లాక్‌లో ప్రభుత్వ శాఖలు విధులు మొదలు పెట్టగా... హైకోర్టు కూడా అదే బాట పట్టాలని నిర్ణయించింది. ఆరు నెలల తరువాత తిరిగి హైకోర్టు భవనంలో కేసుల విచారణ కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 1 వ తేదీ నుంచి పాక్షికంగా కొన్ని బెంచ్‌ల్లో కేసుల విచారణ చేపట్టాలంటూ ఫుల్ కోర్టు తీర్మానించింది. కరోనా ఆందోళనతో న్యాయవాదులు హాజరుకాని పక్షంలో ఆ కేసులను వాయిదా వేసే అవకాశం ఉంది.
సెప్టెంబరు 1 నుంచి పాక్షికంగా తెరుచుకోనున్న హైకోర్టు - High courts Benches may open on September 1st
కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేకపోవడం వల్ల తగిన జాగ్రత్తలతో ఇప్పటికే ప్రభుత్వ శాఖలు విధులు మొదలు పెట్టగా... హైకోర్టు కూడా అదే బాట పట్టాలని నిర్ణయించింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాక్షికంగా కొన్ని బెంచ్‌ల్లో కేసులను విచారణ చేపట్టాలంటూ శనివారం ఫుల్ కోర్టు తీర్మానించింది.
సెప్టెంబరు 1 నుంచి పాక్షికంగా తెరుచుకోనున్న హైకోర్టు
కేసుల విచారణ సందర్భంగా కోర్టులోకి అనుమతించే న్యాయవాదుల సంఖ్యను పరిమితం చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల్లో కూడా కేసుల విచారణ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం హైకోర్టు తానే ముందుగా విధులు ప్రారంభించి జిల్లా కోర్టు న్యాయాధికారులకు భరోసానివ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఇదీ చూడండి:సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ