అంతర్జాతీయ విమాన ప్రయాణికులను 14 రోజులపాటు క్వారంటైన్ నిమిత్తం ఏర్పాటు చేసిన గదుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంపై హైకోర్టు స్పందించింది. ఈ గదుల్లో అసౌకర్యాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురిని ఉంచుతున్నారని... శుభ్రత ఏమాత్రం లేదని... బొద్దింకలు, నల్లులు, దోమలున్నాయనే విషయాన్ని ప్రస్తావించింది. మరుగుదొడ్లలో సరైన నీటి సౌకర్యం లేదని, కనీసం తాగేందుకు నీరు సైతం లేకపోవడంపై పెదవి విరిచింది.
క్వారంటైన్లో అసౌకర్యాలపై సోమవారం హైకోర్టు విచారణ
క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసిన గదుల్లో మౌలిక సదుపాయాల లేమిపై హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురిని ఉంచడంపై ఉన్నత న్యాయస్థానం పెదవి విరిచింది.
క్వారంటైన్లో మౌలిక వసతుల లేమిపై హైకోర్టు ఆరా
కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్, వైద్య విధాన పరిషత్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, స్టేట్ ఎపిడమిక్ సెల్ జాయింట్ డైరెక్టర్, కేంద్రం తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనున్నట్లు సమాచారం .
TAGGED:
curfew