వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 8 వరకు స్టే
17:41 December 03
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను ఈనెల 8 వరకు పొడిగిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ... దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఎదుట ఇవాళ మరోసారి సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు.
ధరణిలో ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియకు స్పష్టమైన చట్టబద్ధత లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదించారు. సేకరించిన డేటాకు భద్రత లేదన్నారు. అంతా చట్టప్రకారమే ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి వాదనల కోసం విచారణను హైకోర్టు ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుపై సర్కారుకు హైకోర్టు నోటీసులు