High Court on Woman Missing: ఓ ఆర్థిక వివాదం విషయంలో స్టేషన్‌కు రావాలని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పోలీసులు రమ్మనడంతో తన భార్య ఏప్రిల్ 20న ఠాణాకు వెళ్లిందని, అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదంటూ ఎం.రవిప్రసాద్ అనే వ్యక్తి మే 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది టీవీ సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఆ మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారని, కొంత సమయం కావాలని అన్నారు.
ఠాణాకు వెళ్లిన మహిళ అదృశ్యంపై... హైకోర్టు ఆందోళన - ap latest news
High Court on Woman Missing: ఓ వివాద పరిష్కారం కోసం పోలీసులు పిలవడంతో ఠాణాకు వెళ్లిన మహిళ కనిపించకపోవడంపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది. కేసుతో సంబంధం లేని మహిళను ఠాణాకు ఎందుకు పిలిచారని జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం పోలీసులను నిలదీసింది.
పోలీసుల వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. ఈ విషయాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన కోర్టు.. ఆమెను ఠాణాకు పిలిపించాల్సిన అవసరం ఏముందని పోలీసులను నిలదీసింది. కోర్టుకు హాజరైన సంబంధిత ఎస్సై బదులిస్తూ.. తాము ఠాణాకు పిలవలేదన్నారు. ఆమె కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఆ మహిళ ఆచూకీ కోసం ఇప్పటి వరకు చేసిన యత్నాలేమిటో అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఎం.శ్యాంకుమార్ అనే వ్యక్తికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి :అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
TAGGED:
woman missing