తెలంగాణ

telangana

ETV Bharat / city

HIGH COURT: '‘డీఅడిక్షన్‌’ పిటిషన్‌పై ఆరేళ్లయినా స్పందించరా?'

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్య వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​లో ఆరేళ్లు గడిచినా కౌంటర్​ దాఖలు చేయకపోవడంపై మండిపడింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

HIGH COURT: '‘డీఅడిక్షన్‌’ పిటిషన్‌పై ఆరేళ్లయినా స్పందించరా?'
HIGH COURT: '‘డీఅడిక్షన్‌’ పిటిషన్‌పై ఆరేళ్లయినా స్పందించరా?'

By

Published : Aug 7, 2022, 10:38 AM IST

మద్య వ్యసన విముక్తి (డీఅడిక్షన్‌) కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ఆరేళ్లయినా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఎక్సైజ్‌, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు.. ప్రజారోగ్యశాఖ, వైద్యవిద్య డైరెక్టర్లు ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

మద్య వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటుకు 2013లో జీవో ఇచ్చినా అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ 2016లో వ్యక్తిగత (పార్టీ ఇన్‌ పర్సన్‌) హోదాలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. ఈ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details