తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఉద్యోగులు తమ జీతం నుంచి ప్రతి నెల 7 శాతం మొత్తాన్ని ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో పొదుపు చేసుకుంటారు. సంస్థ ఆర్థిక పరిస్థితి గాడి తప్పడం వల్ల ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే ఆర్టీసీ ఆ మొత్తాన్ని వాడుకుంది. ఇప్పటి వరకు వడ్డీతో కలిపి ఆర్టీసీ రూ.885 కోట్ల సొమ్ము చెల్లించాల్సి ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా.. ఆర్టీసీ చెల్లించలేదు.
రూ.250 కోట్లు చెల్లించండి..