రాష్ట్రంలో పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. లంచ్ మోషన్ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అనుమతి కోరిన నేపథ్యంలో.. అత్యవసర విచారణకు సీజే ధర్మాసనం అనుమతించలేదు. ఎస్‌ఈసీని ఆశ్రయించాలని షబ్బీర్ అలీకి సూచించింది.
పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్రంలో పుర, నగరపాలక ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణకు అంగీకరించని ధర్మాసనం...ఎస్‌ఈసీని ఆశ్రయించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ
రాష్ట్రంలో నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ షబ్బీర్ అలీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేయాలని కోరారు.
ఇదీ చూడండి :ప్రాణాలు పోయే ముందు గాంధీకి వస్తున్నారు: ఈటల