తెలంగాణ

telangana

ETV Bharat / city

సచివాలయం కూల్చివేతపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ - సచివాలయం కూల్చివేత కేసులు

సచివాలయం కూల్చివేత అభ్యంతరాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కూల్చివేతను నిలిపివేయాలని ధర్మాసనాన్ని పిటిషనర్లు కోరారు. అయితే లంచ్‌ మోషన్‌ కాకుండా సాధారణ పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

telangana Secretariat demolition
telangana Secretariat demolition

By

Published : Jul 8, 2020, 3:25 PM IST

సచివాలయం కూల్చివేతపై అభ్యంతరాలను అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. కరోనా పరిస్థితుల్లో సచివాలయం కూల్చివేతలు నిలిపి వేయాలని కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని.. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో విచారణ జరపాలని విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, చెరుకు సుధాకర్ హైకోర్టును కోరారు.

కూల్చివేతల వల్ల సుమారు 5 లక్షల మంది స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కును కోల్పోతున్నారని వారి తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు తెలిపారు. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అయితే లంచ్ మోషన్ దాఖలు చేసేందుకు అనుమతి తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం.. సాధారణ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details