మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన్న ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తాజాగా విజయవాడ, గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించే అంశంపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది.
అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి - achenna moved to private hospital
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గుంటూరులోని రమేశ్ ఆస్పతిలో చికిత్స అందించాలని సూచించింది.
ప్రైవేటు ఆస్పత్రికి అచ్చెన్నకు తరలించేందుకు హైకోర్టు అనుమతి
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై గత నెల 12న అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఏసీబీ కస్టడీలోనే ఉంటున్నారు.
ఇదీ చదవండి:విశాఖ మూడోపట్టణ పీఎస్కు ఎల్‌జీ పాలిమర్స్ కేసు నిందితులు