తెలంగాణ

telangana

ETV Bharat / city

డీజీపీ, హోంశాఖ కార్యదర్శి హాజరుకావాల్సిందే.. ఏపీ హైకోర్టు ఆదేశం! - డీజీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఓ కేసులో కోర్టు దిక్కారం కింద ఏపీ హైకోర్టుకు రావాలన్న ఆదేశాలపై... ఆ రాష్ట్ర డీజీపీ, హోం సెక్రటరీ ఆఫిడవిట్​ దాఖలు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమన్న కారణంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ నెల 27న ఏపీ హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

ap high court
డీజీపీ, హోంశాఖ కార్యదర్శి హాజరుకావాల్సిందే.. ఏపీ హైకోర్టు ఆదేశం!

By

Published : Jan 25, 2021, 8:21 PM IST

ఈనెల 27న కోర్టుకు హాజరుకావాలని ఏపీ డీజీపీ, హోం సెక్రటరీకి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారికి పదోన్నతిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిటిషన్​పై విచారణ జరిగింది. కోర్టు ధిక్కారం కింద ఇద్దరూ హాజరుకావాలని గతంలోనే ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారుల అఫిడవిట్ దాఖలు చేశారు.

ఏపీ డీజీపీ, హోం సెక్రటరీ అఫిడవిట్‌పై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం నిర్ణయం వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్‌ కోరారని.. డీజీపీ, హోం సెక్రటరీ ఎన్నికల విధులని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఈనెల 27న డీజీపీ, హోం సెక్రటరీ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవీచూడండి:'ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము'

ABOUT THE AUTHOR

...view details