తెలంగాణ

telangana

ETV Bharat / city

AP HIGH COURT : 'జీవోలను వెబ్​సైట్​లో ఉంచకపోవడంపై కౌంటర్ దాఖలు చేయండి' - ఏపీ న్యూస్

ప్రభుత్వ జీవోలను వెబ్ సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాలకు సంబంధించి వారంలో కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ సర్కార్​ను ఆ రాష్ట్ర హైకోర్టు(AP HIGH COURT) ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసి ఆ దస్త్రాన్ని పిటిషనర్లకు అందజేయడానికి సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

hc on GOs
hc on GOs

By

Published : Oct 28, 2021, 7:00 AM IST

ప్రభుత్వ జీవోలను వెబ్ సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాలకు సంబంధించి వారంలో కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ సర్కార్​ను ఆ రాష్ట్ర హైకోర్టు(AP HIGH COURT) ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానంగా మరో వారంలో కౌంటర్ వేయాలని పిటిషనర్లకు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు(AP HIGH COURT) ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

'జీవోఐఆర్ ' వెబ్ సైట్ ల్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచకపోవడం, మరోవైపు అత్యల్ప సంఖ్యలో జీవోలను ఏపీఈగెజిట్ వెబ్ సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7 న జారీ చేసిన జీవో 100 ను సవాలు చేస్తూ పలువురు హైకోర్టు(AP HIGH COURT)లో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా.. కౌంటర్ దాఖలు చేసి ఆ దస్త్రాన్ని పిటిషనర్లకు అందజేయడానికి సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

ABOUT THE AUTHOR

...view details