ఎల్ఆర్ఎస్పై కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు
14:37 January 25
ఎల్ఆర్ఎస్పై కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు
అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటరు దాఖలుకు చివరి అవకాశం ఇస్తున్నామని సర్కారుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన పిల్‌పై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎల్ఆర్ఎస్ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఎల్ఆర్ఎస్, రిజర్వేషన్ల అంశం వేర్వేరని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని ప్రభుత్వ తెలిపింది. కౌంటరు దాఖలు చేస్తామని నాలుగు నెలలుగా చెబుతూనే ఉన్నారని... మెమో అమలు నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. మెమో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం... విచారణను జూన్ 15కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:రేపటి రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్