ముస్లిం శ్మశానవాటికల కబ్జాలపై హైకోర్టులో విచారణ జరిగింది. శ్మశానవాటికల ఆక్రమణలపై వక్ఫ్ బోర్డు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. శ్మశానాల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ఉన్నత న్యాయస్థానం వక్ఫ్ బోర్డును ప్రశ్నించింది. కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్డు చూస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కబ్జాలను అడ్డుకోవడంలో వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
'కబ్జాలను చాలా సాధారణ అంశంగా చూస్తున్నారు' - ముస్లిం శ్మశానవాటికల కబ్జాలపై హైకోర్టులో విచారణ
కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్డు చూస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. ముస్లిం శ్మశానవాటికల కబ్జాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కబ్జాలను అడ్డుకోవడంలో వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

'కబ్జాలను చాలా సాధారణ అంశంగా చూస్తున్నారు'
'వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మైనార్టీల కోసం పనిచేస్తున్నారా? దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణలో బాధ్యతగా ఉండాలిగా?. మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారు కదా?' అని ప్రశ్నించింది. సర్వే నంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.