తెలంగాణ

telangana

ETV Bharat / city

'సచివాలయ నిర్మాణంపై ఈనెల 7లోపు పూర్తి వివరాలివ్వండి' - కొత్త సచివాలయం

telaNGANA
high court on telangana secretariat

By

Published : Jan 2, 2020, 4:31 PM IST

Updated : Jan 2, 2020, 5:40 PM IST

16:29 January 02

సచివాలయ నిర్మాణంపై ఈనెల 7లోపు పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు

సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపాదిత నూతన నిర్మాణం వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సచివాలయానికి మార్పులు చేస్తారా, కొత్తగా నిర్మాస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎంత వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించబోతున్నారని ధర్మాసనం అడిగింది. ఆర్థికమాంద్యం రోజుల్లో ఎంత వ్యయం చేయబోతున్నారని చెప్పాలంది. 

    ప్రతిపాదిత నూతన నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని... కొత్త భవనాలు పూర్తయ్యే వరకు సచివాలయం ఎక్కడ, ఎలా ఉంటుందో చెప్పాలని న్యాయస్థానం అడిగింది. వేర్వేరు చోట్ల కార్యాలయాలు ఉంటే దస్త్రాల కదలిక, గోప్యత విషయమేంటని  ప్రశ్నించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి అదనపు ఏజీ తీసుకెళ్లారు. 

    తాము భవనాలు కూల్చివేయొద్దొన్నామే గానీ, నిర్ణయం తీసుకోవద్దని అనలేదని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో ఈ నెల 7 లోపు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

Last Updated : Jan 2, 2020, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details