తెలంగాణ

telangana

ETV Bharat / city

"ఎన్నికల్లో పోటీ, ప్రచారం ప్రాథమిక హక్కు" - teenmaar

తీన్మార్ ​మల్లన్న ప్రచారాన్ని అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం చట్టబద్ధమైన హక్కు అని న్యాయస్థానం తెలిపింది. ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని తీన్మార్​ మల్లన్న దాఖలు చేసిన హౌజ్​ మోషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

తీన్మార్​ మల్లన్న ప్రచారాన్ని అడ్డుకోవద్దు... హైకోర్టు స్పష్టం

By

Published : Oct 9, 2019, 7:46 PM IST

Updated : Oct 9, 2019, 10:16 PM IST

"ఎన్నికల్లో పోటీ, ప్రచారం ప్రాథమిక హక్కు"

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రచారాన్ని అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఒకవేళ ప్రచారానికి అసరమైన అనుమతులు తీసుకోకపోతే... చట్టపపరంగా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం చేయడం చట్టబద్ధమైన హక్కు అని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. పిటిషనర్​కు ప్రచారం చేసుకునే హక్కు ఉందని... ప్రచారంపై ఆంక్షలు చట్టబద్ధంగానే ఉండాలని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ప్రచారం చేసుకుంటే... అడ్డుకోవడానికి వీల్లేదని సూర్యాపేట ఎస్పీ, మేళ్లచెర్వు పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్ఓను ఆదేశించింది. తనను ప్రచారం చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ దాఖలు చేసిన హౌజ్ మోషన్​పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని విచారణ జరిపారు.

తదుపరి విచారణ 18కి వాయిదా...

అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ... ప్రచారం అడ్డుకున్నారని.. సూర్యాపేట ఎస్పీ తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని తీన్మార్ మల్లన్న తరఫు న్యాయవాది వాదించారు. అభ్యర్థి ఎన్నికల నియమావళిని పాటించాల్సిందేనని... ప్రచారం కోసం ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ప్రచారానికి అనుమతి లేనందునే ఆ రోజు ఆపారని హోంశాఖ తరఫు న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ప్రచారం అడ్డుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా

Last Updated : Oct 9, 2019, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details