ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేయడాన్ని శిక్షగా పరిగణించరాదని.. యజమానికి, ఉద్యోగికి మధ్య బంధాన్ని నిలిపివేయడమే అని హైకోర్టు తీర్పు చెప్పింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన విచారణ, క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నట్టయితే.. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జగిత్యాలకు చెందిన డిప్యూటి తహశీల్దార్ పి.నరసింహాచారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. 2005-06లో వచ్చిన ఆరోపణలపై ఈ ఏడాది జులై నెలలో తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. నరసింహాచారి హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ ఉంటే.. సస్పెండ్ చేయవచ్చు : హైకోర్టు - High Court Of Telangana
ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడాన్ని శిక్షగా పరిగణించరాదని.. అది కేవలం యజమానికి, ఉద్యోగికి మధ్య బంధాన్ని నిలిపివేయడమేనని హైకోర్టు పేర్కొంది. జగిత్యాలకు చెందిన డిప్యూటి తహశీల్దార్ పి.నరసింహాచారిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని సమర్థించింది.
విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషన్ను కొట్టివేయగా.. నరసింహాచారి అప్పీలు దాఖలు చేశారు. అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహన్, జస్టిస్ టి.వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తనను వేధించే ఉద్దేశ్యంతోనే 14 ఏళ్ల తర్వాత తనను సస్పెండ్ చేశారని పిటిషనర్ వాదించారు. అయితే.. వాదనలు విన్న ధర్మాసనం సర్వీసు నిబంధనల ప్రకారం శాఖాపరమైన విచారణ, క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంటే.. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేసే అధికారి ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే.. సస్పెన్షన్పై శాఖాపరమైన అప్పీలు చేసుకోవచ్చని సూచిస్తూ.. నరసింహాచారి అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది.
ఇదీ చూడండి :పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం