తెలంగాణ

telangana

ETV Bharat / city

'గోల్కొండ పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోండి' - high court on save golconda issue

హైదరాబాద్​లో కురిసిన భారీ నష్టాలకు గోల్కొండకు వచ్చిన పగుళ్లపై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గోల్కొండ పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

By

Published : Oct 23, 2020, 10:18 PM IST

Updated : Oct 23, 2020, 10:49 PM IST

చారిత్రక గోల్కొండ కట్టడం పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో నవంబరు 26న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

కుతుబ్ షాహి టూంబ్స్, గోల్కొండ కోట పగుళ్లు బారి... వాటిలో వాన నీరు చేరి దెబ్బతింటున్నాయని ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను నవంబరు 26కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'

Last Updated : Oct 23, 2020, 10:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details