తెలంగాణ

telangana

ETV Bharat / city

'రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి' - high court on lakes

హైదరాబాద్​ కూకట్​పల్లి ఎల్లమ్మ చెరువులో రోడ్డు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

'రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి'
'రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి'

By

Published : Oct 23, 2020, 10:55 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి ఎల్లమ్మ చెరువులో రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. చెరువులో రోడ్డు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మిస్తున్నారని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ ఆరోపిస్తుండగా.. గతంలో ఉన్న రోడ్డునే చదును చేస్తున్నట్లు కార్పొరేటర్ పేర్కొంటున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని సూచించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'

ABOUT THE AUTHOR

...view details