తెలంగాణ

telangana

ETV Bharat / city

క్వాసీ జ్యుడిషియల్​ సభ్యులకు శిక్షణ ఇవ్వాలి: హైకోర్టు

పాక్షిక న్యాయాధికారులుగా వ్యవహరించే సభ్యులకు శిక్షణ అవసరాన్ని గుర్చించేందుకు ఇదే సరైన సమయమని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. చట్టప్రకారం విచారణ విధానం తెలియక తప్పులు చేస్తున్నారని పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ ట్రైబ్యునళ్లలో సభ్యులుగా ఉన్నవారికి న్యాయాధికారులతో సమానమైన శిక్షణ అవసరమని అభిప్రాయపడింది.

క్వాసీ జ్యుడిషియల్​ సభ్యులకు శిక్షణ ఇవ్వాలి: హైకోర్టు
క్వాసీ జ్యుడిషియల్​ సభ్యులకు శిక్షణ ఇవ్వాలి: హైకోర్టు

By

Published : Jul 26, 2020, 6:19 AM IST

Updated : Jul 26, 2020, 6:48 AM IST

పాక్షిక న్యాయాధికారులుగా వ్యవహరించే సభ్యులకు శిక్షణ అవసరాన్ని గుర్చించేందుకు ఇదే సరైన సమయమని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. చట్టప్రకారం విచారణ విధానం తెలియక తప్పులు చేస్తున్నారని పేర్కొంది.

ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ ట్రైబ్యునళ్లలో సభ్యులుగా ఉన్నవారికి న్యాయాధికారులతో సమానమైన శిక్షణ అవసరమని అభిప్రాయపడింది. సహకార శాఖలో అదనపు రిజిస్ట్రార్ హోదాకు తక్కువకాని సభ్యులకు శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రెవెన్యూ చట్టాల్లో భూబదలాయింపు, ఏజన్సీ చట్టాలపై అవగాహన ఉండాలని తెలిపింది.

కార్మికశాఖ అధికారులకు కనీస వేతనాల చట్టం, గ్రాడ్యుటీ చట్టం, పరిహారం తదితరాలపై అవగాహన అవసరమని అభిప్రాయపడింది. కోట్లరూపాయల లావాదేవీలుండే వాణిజ్య పన్నుల శాఖ వెలువరించే ఉత్తర్వులు హైకోర్టు సమీక్షకు వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ ప్రక్రియలో మౌళిక విధానాలు తెలిసి ఉండాలని హైకోర్టు తెలిపింది.

Last Updated : Jul 26, 2020, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details