విశాఖపట్నం, గుంటూరుతో పాటు పలుచోట్ల ప్రభుత్వ భూములు, ఆస్తులు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబుతో పాటు మరి కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత న్యాయస్థానం.. ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
'మిషన్ బిల్డ్ ఏపీపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలి' - మిషన్ బిల్డ్ ఏపీ న్యూస్
మిషన్ బిల్డ్ ఏపీపై ఆ రాష్ట్ర హైకోర్టులో జరిగిన విచారణ నెల రోజులపాటు వాయిదా పడింది. ప్రభుత్వ భూములు విక్రయించాలన్న నిర్ణయంపై పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
'మిషన్ బిల్డ్ ఏపీపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలి'
కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఈ-టెండర్లను ఖరారు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీచూడండి:తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు