తెలంగాణ

telangana

ETV Bharat / city

'రేపు వైద్యవిద్య ప్రవేశాలపై విచారిస్తాం' - వైద్య విద్య ప్రవేశాలు

వైద్య విద్య ప్రవేశాలపై దాఖలైన అన్ని పిటిషన్లను రేపు విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న స్టే ను రేపటి వరకు పొడిగించింది.

'రేపు వైద్యవిద్య ప్రవేశాలపై విచారిస్తాం'

By

Published : Aug 13, 2019, 5:02 PM IST

'రేపు వైద్యవిద్య ప్రవేశాలపై విచారిస్తాం'

వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియపై స్టే ఉత్తర్వులను హైకోర్టు రేపటి వరకు పొడిగించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ కోటా భర్తీ వివాదంపై దాఖలైన వ్యాజ్యాలపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఓపెన్ కేటగిరీ సీట్లు భర్తీ చేయక ముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్​డ్ సీట్లను భర్తీ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవాళ కౌంటరు దాఖలు చేసింది. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ప్రవేశాలు, రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.

మరోవైపు మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులూ పిటిషన్లు దాఖలు చేశారు. వివాదం వల్ల తాము పొందిన సీట్లు కోల్పోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని పిటిషన్లపై రేపు విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.

ఇవీ చూడండి: 'కశ్మీర్​'పై తక్షణ జోక్యానికి సుప్రీం నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details