దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు - high court on disha encounter accused
![దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5361231-919-5361231-1576232874542.jpg)
15:25 December 13
దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు
ఎన్కౌంటర్లో మరణించిన దిశ కేసు నిందితుల మృతదేహాలు చెడిపోకుండా తగిన జాగ్రత్తలతో భద్రపరచాలని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ మృతదేహాలను పరిశీలించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. స్టేపై సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ.. ఎన్కౌంటర్కు సంబంధించిన కేసులన్నీ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం