తెలంగాణ

telangana

ETV Bharat / city

JAYABHERI: జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్​కు హైకోర్టులో ఊరట - high court latest news

జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీ మోహన్, ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసుపై మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చడం సరికాదన్న న్యాయస్థానం.. ఈ కేసులో అన్నిరకాల తదనంతర చర్యలను నిలిపివేయాలని ఆదేశించింది.

relief to muralimohan
relief to muralimohan

By

Published : Aug 4, 2021, 7:17 PM IST

జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. తన వద్ద స్థలం తీసుకుని మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ 41A సెక్షన్ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ విషయమై మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చడం సరికాదన్నారు. భూ యజమానితో ఒప్పందాన్ని జయభేరి ప్రాపర్టీస్ ఉల్లంఘించలేదని దమ్మాలపాటి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ కేసులో అన్నిరకాల తదనంతర చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదీచూడండి:RRR: 'వైఎస్‌ఆర్‌ హయాంలోనే అమర్‌రాజాకు అదనపు భూ కేటాయింపులు'

ABOUT THE AUTHOR

...view details