దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టు స్పందించింది. అత్యవసర విచారణ జరుపుతామని వెల్లడించింది. మృతదేహాలను ఈ నెల 9 తేదీ రాత్రి 8 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 గం.లకు హైకోర్టు విచారణ జరపనుంది. సాయంత్రం 6 గం.కు అందిన వినతిపత్రంపై హైకోర్టు అత్యవసరంగా స్పందించింది. హైకోర్టు విచారణకు అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో పోస్టుమార్టం జరుగుతోందని ఏజీ ధర్మాసనానికి వివరించారు. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. శవపరీక్ష ప్రక్రియ వీడియోను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జీకి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వీడియో సీడీని మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి తమకు అప్పగించాలని తెలిపింది.
మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం - ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టులో అత్యవసర విచారణ
మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం
21:20 December 06
.
Last Updated : Dec 6, 2019, 11:16 PM IST