తెలంగాణ

telangana

ETV Bharat / city

నిలోఫర్ ఆసుపత్రి చిన్నారుల మరణాలపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు.. ఏమనంటే. - హెచ్ఆర్‌సీ తాజా సమాచారం

High Court lawyers complaint in HRC: హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్‌లో బుధవారం చోటుచేసుకున్న చిన్నారుల మరణాలపై పలువురు హైకోర్టు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఇలాంటి వాటికి కారణమవుతున్న అధికారులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్ హెచ్ఆర్‌సీని కోరారు.

High Court lawyers complaint in HRC
హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన న్యాయవాదులు

By

Published : Mar 4, 2022, 12:00 PM IST

High Court lawyers complaint in HRC: హైదరాబాద్ నిలోఫర్‌ ఆసుపత్రిలో బుధవారం జరిగన చిన్నారుల మరణాలపై పలువురు హైకోర్టు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్న పిల్లల చికిత్సలకు పేరుగాంచిన నిలోఫర్ పెద్ద ఆసుపత్రిలో... నిన్న(బుధవారం) ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో 12 మంది చిన్నారులు మృతి చెందారని పలు పత్రికలలో వచ్చిన విషయాన్ని కమిషన్ దృష్టికి న్యాయవాది రాపోలు భాస్కర్ తీసుకెళ్లారు. తక్షణమే దానికి కారణమైన వైద్య సిబ్బంది, అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్ఆర్‌సీని అభ్యర్థించారు.

'ఒకేరోజు వైద్యులు పెద్ద సంఖ్యలో విధులకు గైర్హాజరు కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వచ్చే ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉండటం ప్రభుత్వ వైఫల్యం. 12 మంది చిన్నారులు మరణించడానికి కారణం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం గానే చెప్పుకోవాలి. ఒక్క హాస్పిటల్‌లో 12 గంటల వ్యవధిలో 12 మంది చనిపోవడం దారుణమైన విషయం. చిన్నారుల మరణాలకు కారకులైన వైద్యులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని కోరాను'.

-రాపోలు భాస్కర్, హైకోర్టు న్యాయవాది

ఇదీ చదవండి:Nampally Girl Missing Case : నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం..

ABOUT THE AUTHOR

...view details