తెలంగాణ

telangana

ETV Bharat / city

MANSAS TRUST: అశోక్​ గజపతిరాజు ఆదేశాలు పాటించాల్సిందే: ఏపీ హైకోర్టు - ఛైర్మన్ అశోక్ గజపతిరాజు వార్తలు

మాన్సాస్‌ ట్రస్టు ఈవో వ్యవహార శైలిపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఛైర్మన్‌ అశోక్‌ గజపతి రాజు ఇచ్చే ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ట్రస్టు సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.

ashok gajapathi raju
ashok gajapathi raju

By

Published : Jul 27, 2021, 6:39 PM IST

మాన్సాస్‌ ట్రస్టు ఈవో సహకరించడం లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈవో వ్యవహార శైలిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఛైర్మన్‌ అశోక్‌ గజపతి రాజు ఇచ్చే ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆడిట్‌ అధికారితో మాత్రమే ఆడిట్‌ చేయించాలని.. ఇతరుల ప్రమేయం ఉండకూడదని పేర్కొంది.

ట్రస్టు సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ట్రస్టు అకౌంట్స్‌ సీజ్‌ చేయాలంటూ.. ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ట్రస్టు కింద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌లో జోక్యం చేసుకోవద్దని ఈవోను ఆదేశించింది. పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌నూ సస్పెండ్‌ చేసింది. పాలక మండలి ఏర్పాటుకు జీవో 75పై కౌంటర్ వేయాలని తెలిపింది.

ఇదీచూడండి:MP RAGHURAMA: 'బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details