ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై హైకోర్టులో విచారణ - tsrtc updates
![ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై హైకోర్టులో విచారణ high court hearing tsrtc employees suicide pil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5181824-594-5181824-1574762417073.jpg)
15:24 November 26
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై హైకోర్టులో విచారణ
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కార్మికుల మరణాలు ఆగేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెజస ఉపాధ్యక్షుడు పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు. కార్మికులను విధుల్లోకి తీసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొలేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌లో అభ్యర్థనను మార్చుకుంటే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పిటిషన్‌లో అభ్యర్థనను మార్చుకుంటానని ధర్మాసనానికి విశ్వేశ్వరరావు తెలిపారు.
ఇవీచూడండి: ప్రభుత్వ తీరును ఖండించిన ఆర్టీసీ జేఏసీ