ఏపీ కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేయనుంది. ఔషధ పంపిణీకి గత విచారణలోనే అనుమతించిన న్యాయస్థానం.. చుక్కల మందు పంపిణీపై నేడు విచారణ చేయనుంది.
కంట్లో వేసే చుక్కల మందు తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని.. నివేదికలు రావడానికి మరో 2-3 వారాల సమయం పడుతుంది కాబట్టి అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు పేర్కొంది.