వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు ఇప్పటికీ జర్మని పౌరసత్వం ఉందని పునరుద్ఘాటిస్తూ కేంద్ర హోంశాఖ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. చెన్నమనేని పౌరసత్వం వివాదంపై వ్యాజ్యం... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వద్ద విచారణకు వచ్చింది. రోస్టర్ మారినందున సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు.
ఇప్పటికే పాక్షికంగా వాదనలు విన్నందున విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. జర్మని పౌరుడు పదేళ్లు చట్టసభలో కొనసాగడం తీవ్రంగా పరిగణించదగిన అంశమని... పిటిషన్‌ను త్వరగా తేల్చాలని కోరారు. స్పందించిన ధర్మాసనం... వీలైనంత త్వరగా సంబంధింత బెంచ్ ఎదుట ఉంచాలని రిజస్ట్రీని ఆదేశించింది.