తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు పిటిషన్​పై విచారణ - హైకోర్టులో ఎమ్మెల్సీ ఓటరు నమోదు పిటిషన్​పై విచారణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగించాలని దాఖలైన పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

high court hearing on mlc voter registration date extend pitetion
ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు పిటిషన్​పై విచారణ

By

Published : Nov 5, 2020, 2:40 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలని... న్యాయవాది రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 7 వరకు పొడిగించాలని ఈసీకి తాను ఇచ్చిన వినతిపత్రంపై స్పందించట్లేదని పేర్కొన్నారు. నవంబరు 7 వరకే దరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉందని ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో రేపు తెలిపాలని హైకోర్టు ఆదేశించింది.

విపత్తులు వచ్చినా, ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. డిసెంబరు 1 నుంచి 31 వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కోర్టుకు తెలపగా... దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:బ్యాంక్ వ్యాన్​ లూటీ- ఉగ్రవాదుల పనే!

ABOUT THE AUTHOR

...view details