ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో.. తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల వివరాలను సీల్డ్ కవర్లో ఎన్నికల అధికారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించారు. గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎంపీ కేశినేని నాని(MP kesineni nani) తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎన్నికలు జరిపి, ఫలితాలు వెల్లడించకుండా వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టు ముందు ఉంచాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరిపిన అధికారులు వివరాలను హైకోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
కోర్టు ఆదేశాలతో..
మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఛైర్మన్ ఎన్నిక వివరాలను ఎస్‌ఈసీ హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెదేపా.. ఛైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించింది.
కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. ఛైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబును ప్రతిపాదించాం. వైస్‌ఛైర్మన్లుగా ధరణికోట శ్రీలక్ష్మి, శ్రీనివాస్ చుట్టుకుదురును ప్రతిపాదించాం.ఎంత ప్రలోభపెట్టినా మా కౌన్సిలర్లు తప్పుకోలేదు. తెదేపా తరఫున 15 మంది కౌన్సిలర్లు భయపడలేదు. నా ఓటు కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం తుది నిర్ణయం. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. -కేశినేని నాని, ఎంపీ
ఛైర్మన్ ఎవరైనా సహకరిస్తా..