పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌ను తెలుగుదేశం పార్టీ వారే వేయించారని .. పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
సర్క్యులేషన్ ప్రకారం ప్రకటనలు ఇవ్వట్లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ రంగులతో ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకు విరుద్ధం అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు.