ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పూర్తి పింఛను చెల్లింపు అంశంపై ప్రభుత్వం సమీక్షిస్తోందని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. పింఛనులో 25శాతం కోత విధించడంపై రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది.
పింఛన్లలో 50 శాతం కోతపై ప్రభుత్వం సమీక్షిస్తోంది: ఏజీ
రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ పింఛన్లలో 50 శాతం కోత విధించడంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వం సమీక్షిస్తోందని, జూన్ మొదటి వారం వరకు గడువు కావాలని ఏజీ కోరారు. తదుపరి విచారణను జూన్ 1కి హైకోర్టు వాయిదా వేసింది.
పింఛన్లలో కోతపై హైకోర్టులో విచారణ
రెండు నెలలుగా పూర్తి పింఛను అందక విశ్రాంత ఉద్యోగులు లాక్ డౌన్లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. పెన్షన్ విశ్రాంత ఉద్యోగుల హక్కని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని.. కోత విధించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. ప్రభుత్వం పరిశీలిస్తోందని.. జూన్ మొదటి వారం వరకు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. జూన్ 1 న తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఇదీ చూడండి :నిమ్మకాయ సోడా కలిపిన మంత్రి
Last Updated : May 27, 2020, 3:20 PM IST