ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చుక్కల మందుకు సంబంధించిన నివేదిక అందిందని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. చుక్కల మందు వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్, నిల్వకు నెల నుంచి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
Anandaiah Medicine: 3నెలల తర్వాతే ఆనందయ్య చుక్కలమందు..! - 3 నెలల తర్వాతే.. ఆనందయ్య చుక్కలమందు..!
ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టెరిలిటీ టెస్టుకు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందన్న ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి నివేదిక కోసం మరో 3 నెలలు పడుతుందని.. నివేదిక రాకుండా చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది.
ap high court on anandhaiya eye drops
స్టెరిలిటీ టెస్టుకు సంబంధించి నివేదిక రాకుండా చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తెలిపింది. ఇందువల్ల మూడు నెలల తర్వాత పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. భోజన విరామం నేపథ్యంలో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అనంతర ఆనందయ్య, పిటిషనర్ల వాదనలు ధర్మాసనం విననుంది.
ఇదీ చదవండి:మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన
Last Updated : Jun 3, 2021, 3:27 PM IST