ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును (anandaiah medicine).. ప్రభుత్వమే పంపిణీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో (ap high court) విచారణ కొనసాగుతోంది. 4 రోజులు సమయమిచ్చినా పంపిణీ వివరాలు ఎందుకు సమర్పించలేదని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
anandaiah: ఆనందయ్య మందు పంపిణీ వివరాలు ఎందుకు సమర్పించలేదు?: ఏపీ హైకోర్టు - కృష్ణపట్నం ఆనందయ్య మెడిసిన్ తాజా వార్తలు
ఆనందయ్య మందు ( anandaiah medicine) పంపిణీ వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మెుదట వాదనలు విన్న న్యాయస్థానం.. కాసేపటికి.. విచారణను 15 నిమిషాలపాటు వాయిదా వేసింది.
ఆనందయ్య మందు పంపిణీ
మందు పంపిణీకి సంబంధించి చేపట్టిన చర్యల వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కాసేపటికి విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. మలికార్జున, ఉమామహేశ్వరరావు అనే వ్యక్తులు ఈ వ్యాజ్యం వేశారు.
ఇవీచూడండి: ఆనందయ్య మందు.. కోటయ్య మృతి