High Court on inter practicals: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
హైకోర్టు తీర్పుతో ప్రాక్టికల్ పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉంది. అధికారులు కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నారు. సొంత కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్..
ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన పరీక్ష తేదీలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22న పరీక్షలు మొదలై.. మే 12 వరకు జరగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: KTR On Congress: 'భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై కాంగ్రెస్ అధ్యక్షుడు బాధపడుతున్నారు'