తెలంగాణ

telangana

ETV Bharat / city

జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు - జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు న్యూస్

ఏపీకి చెందిన జడ్జి రామకృష్ణకు(judge ramakrishna) షరతులతో కూడిన బెయిల్​ను ఆ రాష్ట్ర హైకోర్టు(high court) మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఆదేశించింది. ఈ మేరకు జడ్జి రామకృష్ణకు రూ.50 వేల పూచీకత్తుతో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు
జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

By

Published : Jun 15, 2021, 2:35 PM IST

ఏపీలో సస్పెండైన జడ్జి రామ‌కృష్ణ‌కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీక‌త్తుతో బెయిల్ ఇచ్చిన ధ‌ర్మాస‌నం.. విచార‌ణాధికారికి స‌హ‌కరించాల‌ని ఆదేశించింది. రాజద్రోహం కేసులో అరెస్టయిన జడ్జి రామకృష్ణ.. బెయిల్ కోసం ఉన్నత న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ష‌రతుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. కేసు అంశంపై మీడియాతో మాట్లాడొద్ద‌ని ఆయ‌న్ను ఆదేశించింది. జడ్జి రామకృష్ణ ప్ర‌స్తుతం పీలేరు స‌బ్‌జైలులో ఉన్నారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై జడ్జి రామకృష్ణను పోలీసులు ఏప్రిల్​లో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య దీనిపై ఫిర్యాదు చేయగా.. జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

ఇదీ చదవండి: Firing: కాల్చి చంపాడు.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details