తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం - తెలంగాణ కరోనా పరీక్షల వివాదం

telangana high court
telangana high court

By

Published : Jun 8, 2020, 3:52 PM IST

Updated : Jun 8, 2020, 4:23 PM IST

15:51 June 08

కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలుచేయడం లేదని  రాష్ట్ర ప్రభుత్వంపై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్​ను బాధ్యుల్ని చేస్తామని పేర్కొంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. విచారణ జరగాల్సి ఉందని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని వ్యాఖ్యానించింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని పేర్కొంది. ఈనెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.

Last Updated : Jun 8, 2020, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details