Jagan Case: రోజువారీ విచారణకు ఏపీ సీఎం జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఆదేశాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. రోజువారీ విచారణపై జగన్ పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చిన న్యాయస్థానం, ఆయన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతిచ్చింది. సీబీఐ కోర్టు తప్పనిసరని భావించినప్పుడు మాత్రం జగన్ హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:ap cm jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ