తెలంగాణ

telangana

ETV Bharat / city

మంచు ఫ్యామీలీకి హైకోర్టులో ఊరట.. ఆ కేసు విచారణ 8వారాలు పాటు నిలిపివేత - ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజా వార్తలు

HERO MOHANBABU : సినీ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలు నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది.

మంచు ఫ్యామీలీ
మంచు ఫ్యామీలీ

By

Published : Sep 19, 2022, 10:15 PM IST

HC ON MOHANBABU PETITION : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను.. 8వారాలు నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

2019 మార్చి 22వ తేదీన అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని మోహన్‌ బాబు కుటుంబం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో కోడ్‌ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details