MOVIE TICKETS: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు - టికెట్ ధరలు తగ్గింపు
16:26 December 14
MOVIE TICKETS: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు
MOVIE TICKETS: ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సర్కార్ ఇచ్చిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.
టికెట్ రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కొన్ని రోజుల ముందు జీవో నంబర్ 35ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. టికెట్ల ధర తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 35ను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది.
ఇదీచూడండి:Bheemla Nayak: రానాకు 'భీమ్లా నాయక్' సర్ప్రైజ్.. వీడియో అదుర్స్!