AP High court on konaseema riots : కోనసీమ అల్లర్ల వ్యవహారంలో అమలాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. నిందితుడు అరిగెల వెంకటరామారావు, మరొకరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్లను కొట్టేసింది. అల్లర్లలో పిటిషనర్లది కీలక పాత్రని, సాక్షులు సైతం ఇదే విషయం వాంగ్మూలంలో చెప్పారని అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. పిటిషనర్లను విచారించాల్సి ఉందని, వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు.
కోనసీమ అల్లర్ల కేసు.. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత
AP High court on konaseema riots : కోనసీమ అల్లర్ల వ్యవహారంలో అమలాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్లను కొట్టేసింది.
konaseema riots
ఆ వివరాలను పరిగణనలోకి తీసుకుని పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి కొట్టివేశారు. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరుగా మార్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.