MLC Ananthbabu Bail Petition: దళిత యువకుడు సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. రిమాండ్‌కు పంపిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తిచేసి కిందికోర్టులో పరిపూర్ణమైన అభియోగపత్రం దాఖలు చేయని కారణంగా సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం డిఫాల్ట్ బెయిలు ఇవ్వాలని కోరుతూ అనంతబాబు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కె. చిదంబరం వాదనలు వినిపించారు. నిబంధనల మేరకు నిర్ధిష్ట సమయంలోనే అభియోగపత్రం వేశామని పోలీసు తరఫు న్యాయవాది దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు.
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు - driver subramanyam murder case
MLC Ananthbabu Bail Petition: వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రిమాండ్‌కు పంపిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయని కారణంగా.. బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ తరుఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సుబ్రమణ్యం తల్లి తరుఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. నిందితునిపై పోలీసులు గతంలో రౌడీషీట్ తెరిచారని తెలిపారు. 90 రోజుల్లోపే అభియోగపత్రం వేశారని కోర్టుకు వేశారని కోర్టులో వెల్లడించారు.
సాంకేతిక కారణాలతో దానిని దిగువ కోర్టు తిరస్కరించినా.. సరైన సమయంలోనే అభియోగపత్రం వేసినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. మృతుడి తల్లి వీధి నూకరత్నం తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 90 రోజుల్లోపే పోలీసులు అభియోగపత్రం వేశారన్నారు. సాంకేతిక సాక్ష్యాల నివేదికలు అందిన తర్వాత అదనపు అభియోగపత్రం వేస్తారని మాత్రమే పోలీసులు పేర్కొన్నారని తెలిపారు. నిందితునిపై గతంలో పోలీసులు రౌడీషీట్ తెరిచారని వాదనలు వినిపించారు. అనంతబాబుపై చాలా కేసులు నమోదయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం అనంతబాబు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: